Lord | ద‌త్తాత్రేయునికి పంచామృత అభిషేకం..

Lord | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు శ్రీ షిరిడి సాయి దివ్య, ధ్యాన, జ్ఞాన మందిరంలో ద‌త్తాత్రేయ స్వామి(Lord Dattatreya) వారికి వైభవంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. గురువారం ద‌త్త జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని దత్తాత్రేయ స్వామి వారికి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులచే పంచామృత అభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. అంతరం లలిత విష్ణు సహస్ర నామ పారాయణం(Recitation of Nama) చేశారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ రేపల్లె వెంకటనారాయణ (రఘు)పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply