రాయపూర్, ఆంధ్రప్రభ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 20మంది మావోయిస్టులు మృతి చెందారని సమాచారం.
కూంబింగ్ నిర్వహిస్తుండగా…
జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులున్నారని సమాచారం అందడంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.