Fire accident – బాలా నగర్ లో అగ్ని ప్రమాదం – ఒకరు సజీవ దహనం
హైదరాబాద్: బాలానగర్ పరిధి హరిజన బస్తీలోని రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు చెలరేగి సాయి శ్రీనివాస్(30) మృతి చెందాడు.శవపరీక్ష కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పారు.
కిషన్‌బాగ్‌లో మరో ప్రమాదం..
మరోవైపు పాతబస్తీ కిషన్‌బాగ్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో నాలుగంతస్తుల భవనం సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. ఇవి నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. భవనంలోని ప్రజలు ముందే అప్రమత్తమై బయటకు వచ్చారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పారు.