రైల్వేల్లో ఖాళీలు భర్తీ చేయాలి : ఏఐవైఎఫ్

రైల్వేల్లో ఖాళీలు భర్తీ చేయాలి : ఏఐవైఎఫ్

రాప్తాడు, ఆంధ్రప్రభ : రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ పేర్లతో ఉద్యోగులను తొలగించడం ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సంధర్భంగా రాప్తాడు నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

అధ్యక్షులు గా ప్రసాద్ కార్యదర్శి గా ధనుంజయ ఉపాధ్యక్షులుగా చాంద్ బాషా వంశీ బాలాజీ కోశాధికారి హరీష్ నాయక్ తో పాటు 13 మంది కార్యదర్శి వర్గ సభ్యులు 53 మంది కౌన్సిల్ మెంబర్లతో నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు.