మాజీ సీఐ బంగారు ఏ బ్యాంకులో పెట్టారు?

మాజీ సీఐ బంగారు ఏ బ్యాంకులో పెట్టారు?
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండలం రాప్తాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ హనీ ట్రాప్ కేసులో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న మాజీ సిఐ శ్రీహర్ష దాదాపు 1కేజీ బంగారాన్ని రాప్తాడు మండలంలో ఉన్న 3 బ్యాంకులలో పెట్టి నామమాత్రపు డబ్బులు తీసుకున్నట్లు గత నాలుగైదు రోజుల నుండి మండలంలో భారీగా చర్చ జరుగుతోంది.అందుకు రాప్తాడు అనంతపురం జర్నలిస్టులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి సహకరించినట్లు చర్చించుకుంటున్నారు.
హనీ ట్రాప్ బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో బ్యాంకు అధికారులు ఆయా గ్రామాల స్థానిక నాయకులు జర్నలిస్టులతో బంగారం ఏం చేయాలి?ఎవరు తీసుకెళ్తారు? మా మీదకు ఏమైనా వస్తుందా? అని భయపడుతూ ఆ బంగారాన్ని వెంటనే మీరు తీసుకెళ్లండి అని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అలాగే చిన్మయ నగర్ రాప్తాడు హైవే ఏరియాలలో ఫ్లాట్లు భూములు బినామీ పేర్ల మీద కొనుగోలు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
జర్నలిస్టులు మాజీ సిఐతో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళని హనీ ట్రాప్ లో జర్నలిస్టులు కూడా డబ్బులు తీసుకున్నారని అలాగే ఫోన్ ఫే లకు డబ్బులు వేయించుకున్నారని మండల ప్రజలు బలంగా చర్చించుకుంటున్నారు. హనీ ట్రాప్ కేసులో బయటకు రాని ఇంకా చాలా విషయాలు మాజీ సిఐ శ్రీ హర్ష ఫోన్ కాల్స్ బయటకు తీస్తే వస్తాయంటున్నారు. అందువలన మాజీ సిఐ ఫోన్ కాల్ రికార్డులను బయటికి తీయాలి. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చెయ్యాలి లేదా సిబిఐ కు అప్పగించాలని రాప్తాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
