నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం

నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం

అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదానికి గురైన నిరుపేదలకు సీఎంఆ ర్ఎఫ్ వరం
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఏదైనా రోడ్డు ప్రమాదంలో గురై, తీవ్ర అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకోలేని నిరుపేదలను సీఎంఆర్ ద్వారా ఆదుకోవడమే మా ధ్యేయమని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. ఆర్థిక ఇబ్బం దులు పడుతూ వైద్యం పొందలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా చెక్కులు అందిం చడం తన బాధ్యత అని తెలిపారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపి ణీ చేశారు.

ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ముఖ్య అతిథి హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం ఆర్ఎఫ్ సహాయం అం దేలా చూస్తానన్నారు. దరఖాస్తు విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం లో తన బృందం ఎప్పు డూ అందుబాటులో ఉంటుందన్నారు. దర ఖాస్తు చేసుకున్న అర్హు ల జాబితాను ఖచ్చి తంగా సెక్రటేరియట్ కు పంపించడం జరుగు తుందన్నారు.

దరఖాస్తు మొత్తంలో వీలైనంత ఎక్కువగా చెల్లించేలా చర్యలు తీసుకుంటు న్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని చెప్పారు. కాగా మొత్తం 85 మందికి రూ.56, 20,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. గడిచిన నాలుగేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నియో జకవర్గంలో ఒకటి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నాగారంలో గల 396 ఇల్లు, కలెక్టరేట్ సమీపంలో మరో 200 ఇల్లు ఉన్నాయన్నారు.

వీటిని నిర్మించి ఏళ్లు గడిచిందని వాటి కిటి కీలు, తలుపులు చోరీకి గురవుతున్నాయని తెలిపారు. ఈ విషయ మై అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అంతే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రస్తావించానని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, చింతకాయల రాజేందర్, ఇప్పకాయల కిషోర్, దాంపల్లి జ్యోతి మురళి, బొబ్బిలి సుమిత్ర వేణు, కలిపే అర్చన చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, బిజెపి నాయకులు బద్దంకిషన్, పుట్ట వీరేందర్ పాల్గొన్నారు.

Leave a Reply