తెలంగాణ ఎరుకల సంఘం మండల కమిటీ ఎన్నిక

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పేరం వీరస్వామి ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ఇనుగుర్తి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా మాదగని ఉపలయ్య, కార్యదర్శిగా గుతూప రాములు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా మాదగని వెంకటేశం, సహాయ కార్యదర్శిగా మాదగని యాకయ్య, కోశాధికారిగా గుతూప యాకయ్యలను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి, ఎరుకల సామాజిక వర్గ సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి ఉపలయ్య, జిల్లా ఇన్‌చార్జి కట్ల పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం బక్కయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కుంభం ప్రశాంత్, యూత్ జిల్లా అధ్యక్షుడు కోట ఎల్లేష్, కేసముద్రం మండల అధ్యక్షుడు కట్ట వెంకన్న, కేసముద్రం యూత్ అధ్యక్షుడు కోనేటి సంపత్ నిశాంత్‌తో పాటు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.