లక్ష్మారెడ్డి ఆకస్మిక మృతి బాధాకరం
లక్ష్మారెడ్డి ఆకస్మిక మృతి బాధాకరం
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.
మరిపెడ, ఆంధ్రప్రభ : మరిపెడలో స్థిరపడిన, చిన్నగూడూరు మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మరిపెడ బంగ్లాలోని లక్ష్మారెడ్డి నివాసానికి చేరుకున్న ఆమె, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లక్ష్మారెడ్డి వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక, రాజకీయ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.
ఆయన మరణం కుటుంబ సభ్యులకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు కూడా తీరని లోటని అన్నారు. భగవంతుడు లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, బండ బిక్షం రెడ్డి, బోడ శ్రీను నాయక్, కౌసల్యదేవిపల్లి సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి, పెదబోయిన రంగన్న, షేక్ యాకుబ్ పాషా, యాకుబ్ పఠాన్, లింగమూర్తి, దుబ్బాక వెంకట్ రెడ్డి, బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
