వడదెబ్బతో వృద్ధురాలు భాగ్యమ్మ మృతి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో పూల వ్యాపారం చేస్తూ జీవనం గడిపిన వృద్ధురాలు సుంకరి భాగ్యమ్మ(79) వడదెబ్బకు గురై మృతి చెందారు. వడి దెబ్బతో పూర్తిగా ఆరోగ్యం క్షీణించి ఆమె కన్నుమూశారు. సోమవారం స్థానికులు భాగ్యమ్మ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పట్టణంలో అందరికీ పూల భాగ్యమ్మగా సుపరిచితురాలైన ఆమె మృతి తీరని లోటు అని వారంతా నివాళులర్పించారు. బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య భాగ్యమ్మ అంత్యక్రియలు ముగిశాయి.

Leave a Reply