కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

సూర్యాపేట, ఆంధ్రప్రభ : ఎన్నో పోరాటాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణను 12 ఏళ్లలో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి నమునా దిశగా కేసీఆర్ చేశారని వివరించారు. సమైక్య పాలన నడుస్తున్న కాలంలో తెలంగాణ యాస మాట్లాడితే పనులు కావని భయపడే స్థితికి ఆంధ్రపాలకులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్నో కుట్రలను చేధించి అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా చేశారని పేర్కొన్నారు.

మాంసం, పాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రగామిగా కేసీఆర్ చేశారని వివరించారు. మార్పు పేరుతో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తుందన్నారు. కేసీఆర్ అమలు చేసిన హామీలు కొనసాగించలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ నీతిలేని పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు అశోక్ నగర్ వెళ్లి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రస్తుతం అశోక్ నగర్ వెళ్లాలంటే ప్రభుత్వం ఎందుకు జంకుతుందని ప్రశ్నించారు. సమైక్యపాలనలో సాగిన జలదోపిడి తిరిగి ప్రారంభమైందని రాష్ట్రంలో ఆంధ్రా ఉద్యోగుల నాయకుల పెత్తనం జరిగిందన్నారు. తెలంగాణ సీఎం, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని విమర్శించారు. ముందుగా తెలంగాణ తల్లి తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

Leave a Reply