ఎస్ ఆర్ క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ కంఠమహేశ్వర దేవాలయం ఆవరణలో SR క్రికెట్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ క్యాంపు మే 1 నుండి జూన్ 1 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు కొర్ర సాయిరాం, కట్ట వెంకటేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం క్రికెట్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు, అకాడమీకి స్థలాన్ని సహకరించిన దాత వారి కుమారుడు ఆవుల రాజు, శ్రీ గాయత్రి పాఠశాల గుడిమల్కాపురం ప్రిన్సిపాల్ కడారి ఆనంద్ యాదవ్, డాక్టర్ మారగోని వెంకటేష్ గౌడ్, పల్లె ఆనంద్ గౌడ్, బద్దం సాయి కిరణ్ గౌడ్, రసాల మధు సాగర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
