పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి వివేక్ వెంకటస్వామి
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా మండలంలోని కిష్టంపేట అర్బన్ ఇకోపార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి వివేక్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని అన్నారు. అడవులు ఎంత ఎక్కువగా ఉంటే అంత వర్షాలు కురుస్తాయని, పర్యావరణ సమతుల్యతతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
