వ్యాపారి అదృశ్యంతో…ఆందోళనలో బాధితులు.

వ్యాపారి అదృశ్యంతో…ఆందోళనలో బాధితులు.
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పు లిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. ఆ వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లి లోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకు న్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగు తిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించు కున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావ టంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాధి తులు లబోదిబో మంటున్నారు. బాధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకు న్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు.
