బాలకృష్ణను పరామర్శించిన దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ…
హైదరాబాద్ నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గాంధీ
సినిమా షూటింగ్లో గాయపడిన బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
చైర్మన్తో పాటు తనయుడు బొర్రా డీలేష్ కూడా హాజరు
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఈసందర్భంగా బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బొర్రా రాధాకృష్ణ, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని యథావిధిగా ప్రజాసేవ, సినీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. బాలకృష్ణకు ధైర్యం చెబుతూ త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని మనస్ఫూర్తిగా అభిలషించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు ఆయన తనయుడు బొర్రా డీలేష్ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
