Draupadi’s Murmu | శ్రీవారి స‌న్నిధిలో ముర్ము..

Draupadi’s Murmu | శ్రీవారి స‌న్నిధిలో ముర్ము..

ఆంధ్రప్రభ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi’s Murmu) తిరుపతి–తిరుమల పర్యటనకు రానున్నారు. గురువారం మధ్యాహ్నం 3.25 గంటలకు ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుచానూరుకు బయలుదేరి, సుమారు 3.55 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

అనంతరం రాష్ట్రపతి తిరుమలకు చేరుకుని, శ్రీ పద్మావతి అతిథిగృహంలో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు, అంటే శుక్రవారం ఉదయం 9.30 గంటలకు శ్రీవరాహ స్వామిని దర్శించుకోనున్నారు. వెంటనే ఉదయం 10 గంటలకు శ్రీవారిని శ్రీవారి ఆలయంలో దర్శించుకుంటారు.

తిరుమల దర్శన అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి హైదరాబాదు పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరనున్నారు.

ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. సంప్రదాయం ప్రకారం నల్ల దుస్తులు ధరించి, ఇరుముడి మాలాతో 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేశారు. ఈ సందర్శనతో శబరిమల క్షేత్రానికి వెళ్లిన తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె చారిత్రాత్మక రికార్డు నెలకొల్పారు. రాష్ట్రపతులలో 1970 దశకంలో వి.వి. గిరి తర్వాత అయ్యప్ప దర్శనం చేసిన రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు.

Leave a Reply