కనకదుర్గమ్మ నిత్య అన్నదానానికి విరాళం
కనకదుర్గమ్మ నిత్య అన్నదానానికి విరాళం
రూ.1 లక్షకు పైగా విరాళం అందజేత
ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్కు చెందిన కొండా బాల ప్రదీప్, విజయశాంతి దంపతులు తమ కుటుంబ సభ్యుల తరఫున రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదం చిత్రపటం రసీదులను అందజేశారు.
