యువశక్తికి కొత్త నిర్వచనం… యూత్ టైం బ్యాంక్

యువశక్తికి కొత్త నిర్వచనం… యూత్ టైం బ్యాంక్

జీజీహెచ్‌లో 73వ రోజు సేవ‌ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ,ఆంధ్రప్రభ : విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో వినూత్నంగా అమలు చేస్తున్న యూత్ టైం బ్యాంక్ కార్యక్రమం యువత సేవాభావానికి కొత్త దిశను చూపుతోందని డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమం 73వ రోజు కొనసాగుతున్న సేవలను మంగ‌ళ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. యూత్ టైం బ్యాంక్ సేవల్లో భాగంగా దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ విద్యార్థులు, వాసవ్య మహిళా మండలి వాలంటీర్లు పాల్గొన‌గా వారు అందిస్తున్న సేవ‌ల‌పై ఆనందం వ్య‌క్తం చేశారు. రోగులు, వారి సహాయకులకు మార్గదర్శనం చేయడం, అవసరమైన సమాచారం అందించడం, ఆసుపత్రిలో సేవలను సులభతరం చేయడంలో యువత చురుకుగా పాల్గొన‌డంపై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ సమాజ సేవలో యువత భాగస్వామ్యం పెరగడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యూత్ టైం బ్యాంక్ ద్వారా యువత తమ సమయాన్ని సమాజానికి అంకితం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జ‌రిగే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో బ్యాంకు సేవ‌లు విస్తరించడం మైలురాయిగా తెలిపారు అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా సేవలు విస్తరించాలంటూ ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌, ఆర్ఎంవో త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply