దీపావళి బాంబులు సీజ్

దీపావళి బాంబులు సీజ్

మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట(Mangapet) మండలంలోని కమలాపురంలో అనుమతి లేకుండా నిల్వ చేసిన దీపావళి బాంబులను ఈ రోజు సీజ్ చేసినట్టు మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి(SI TVR Suri) తెలిపారు. కమలాపురంకు చెందిన తాటిపల్లి రాజేందర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేట నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా జనావాసాల మధ్య తన ఇంటిలో అక్రమంగా సుమారు 1,89,265 రూపాయల దీపావళి బాంబుల(Diwali Bombs)ను నిల్వ చేసాడు.

ఈ రోజు కమలాపురంలో పోలీసుల తనిఖీలలో ఈ బాంబులు లభించాయి. దీంతో తాటిపల్లి రాజేందర్ అక్రమంగా నిల్వ చేసిన సుమారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు విలువ చేసే బాంబులను స్వాధీనం చేసుకొని, రాజేందర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై టీవీ ఆర్ సూరి(SI TVR Suri) తెలిపారు.

Leave a Reply