మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తోందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా కోటీశ్వరుడు కావాలన్న ఉద్దేశంతో వారికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.

ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండాలని చెప్పారు. వివిధ బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు కావలసిన గుణాలు అందించడం జరుగుతుందన్నారు. వాటి రుణాలను సద్వినియోగం చేసుకొని పలు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూ చించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని వేగవంతంగా నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ప్రతి మహిళా భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దశరథం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజబాబు గౌడ్, మాజీ ఎంపీపీలు, గాల్ రెడ్డి, సుదర్శన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కిష్టా గౌడ్, పాల కేంద్రం అధ్యక్షులు గాల్ రెడ్డి, ఐకెపి ఎపిఎం సాయిలు, డ్వాక్రా మహిళలు గ్రామ సచివాలయ పాలకవర్గ సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.