భగత్ సింగ్‌కు ఘన నివాళి..

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యాలయంలో సోమవారం షహీద్ భగత్ సింగ్ 95వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప విప్లవకారుడని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం రావాలని, పేదల రాజ్యం నెలకొనాలని, సమానత్వం సాధించాలని ఆయన ఆశయాలు ఉన్నాయని తెలిపారు.
1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడం దేశ చరిత్రలో మరచిపోలేని ఘటనగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాశ రవి, శ్రీపతి మల్లేష్, సుల్తాన్ సాయిలు, హనుమాన్లు, కొండెంగుల సుదర్శన్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
