ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన..

భీమ్‌గల్ టౌన్ , ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని వేల్పూర్ రోడ్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ వారు రిజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ బీ.నాగమణి(స్వామి),హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయమని అన్నారు.
పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి సుమారు సంవత్సరంకు కావాల్సిన మందులు పంపిణీ చేశారు. పట్టణ ప్రజల తరఫున చైర్మన్ ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ముత్తూట్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ దంపతులకు శాలువా పూలమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్,హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్, సిబ్బంది వినయ్ విగ్నేష్, వర్ష, తదితరులు పాల్గొన్నారు.
