డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం

డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : డిజిటల్ జనగణన పై జిల్లా డిఆర్డిఏ,మండల తహశీల్దార్,మండల ప్రజా పరిషత్ అధికారులు,మండల స్థాయి వివోఎలతో డిజిటల్ జనగణన పై మండలంలోని పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్ తండా లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా జి.లక్ష్మీశా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ జనగణలో ఎ.కొండూరు మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వివోఏలకు అధికారులకు ఆయన సూచించారు.

అలానే డిజిటల్ జన గణనపై చరవాణి లో ఎలా నమోదు చేయాలో కలెక్టర్ తన చరవాణిలో డిజిటల్ జనగణనను చేసి చూపించారు. అలానే తమ వ్యక్తిగత చరవాణిలో, కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ జన గణనపై అధికారులు ప్రతిరోజు సమీక్ష జరపాలని,జనగణన కార్యక్రమం వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అలానే మండలంలో జరుగుతున్న ఎన్ ఆర్ జి ఎస్ పనులపై ఆయన ఆరా తీశారు.

నరేగా పనుల విషయం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతిరోజు కూలీలకు పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చైతన్య నగర్ బీసీ కాలనీకి, త్వరత గతిన కృష్ణా జలాలు సరఫరా జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా కాలనీకి అవసరమైన మంచినీళ్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానంతరం మండల పరిషత్ పాఠశాలలో కొబ్బరి మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అధికారి నాంచారయ్య, ఆర్డీవో ఎ.కుమార్, ఎంపీడీవో బొజ్జ గాని శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.ఉదయ భాస్కర్, ఆర్ఐ దివ్య ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ సి బాల శంకర్, ఈఈ రామకృష్ణ, ఇరిగేషన్ డిఈ ఉమాశంకర్,ఎఈ ఎస్.అభిలాష్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాఘవేంద్ర, జేఈ సిహెచ్ సాయిలక్ష్మి, డ్వామా పిడి, పార్థసారథి, ఏపీవో అనురాధ, అధికారులు సచివాలయ సిబ్బంది ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply