పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం…

పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం…
పటమట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆహారాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ సంజయ్‌గాంధీ నగర్‌లో ఉన్న దామోదర సంజీవయ్య నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నాం భోజన కార్యక్రమం అమలవుతున్న విధానాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం మధ్యాహ్నాం స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికీ తమ ప్రభుత్వం మధ్యాహ్నా భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పుస్తకాలు, యనిఫామ్, బ్యాగ్‌లతో పాటుగా ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు తల్లికి వందనం పేరుతో అందచేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడమే కాకుండా ప్రతి రోజూ వారి మెనూను విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ నిర్దేశించి అమలు చేస్తున్నామన్నారు.

విద్యార్థులకు చదువుతో పాటుగా ఆరోగ్యాన్ని అందించేందుకు వైద్య శిబిరాలు, టీకాలు ఇవ్వడమే కాకుండా పాఠశాల ఆవరణలో ఆర్వో ప్లాంట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈ సారి బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయింపులు కూడా భారీగా పెంచామని చెప్పారు. పిల్లలు చక్కగా చదువుకుని అత్యుత్తమ మార్కులు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొట్లూరి సాయిబాబు, అబ్దుల్ కరీమ్, మేదరమెట్ల నారాయణ, బర్బ్రాలు, బాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

