మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

జన్నారం, ఆంధ్రప్రభ : మార్క్ పేడ్, సింగల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మధ్యాహ్నం నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల సౌకర్యార్థమే మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మక్కలను కొనుగోలు కేంద్రంలోని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఆర్థికంగా లబ్ధి పొందాలని ఆయన సూచించారు.

తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడే ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీల స్పెషల్ మల్లారెడ్డి, స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తాహసిల్దార్ బక్కయ్య, స్థానిక సెర్ఫ్ ఏపీఎం లలితకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్, సర్పంచులు, నేతలు కె. వెంకటి, నందునాయక్, ఎం.రాజన్న, అల్లం రవి, డి.రమేష్, ఎం.ఇందయ్య, ఎం.సతీష్, రియాజోద్దీన్, డి.కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.