Nennal కల్వర్టు నిర్మాణంలో నాణ్యత లోపాలా?
Nennal కల్వర్టు నిర్మాణంలో నాణ్యత లోపాలా?
- క్యూరింగ్ లేకుండానే పనులు పూర్తి చేశారంటూ స్థానికుల ఆందోళన
నెన్నెల (Nennal), ఆంధ్రప్రభ:
మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనం ఎదురుగా ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన కల్వర్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం పూర్తయిన ఈ కల్వర్టుకు అవసరమైన క్యూరింగ్ ప్రక్రియ చేపట్టకుండా పనులు ముగించారని వారు పేర్కొంటున్నారు.
నిర్మాణం పూర్తయిన తర్వాత కాంక్రీటుకు నిర్దిష్ట కాలం పాటు నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియను విస్మరించారని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం మండుతున్న ఎండల కారణంగా కల్వర్టు స్లాబ్ ఎండిపోతుండటంతో భవిష్యత్తులో నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కల్వర్టు పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్వర్టు స్లాబ్‌పై మట్టి కట్టలు వేసి నిరంతరం నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ, గుత్తేదారు ఆ బాధ్యతను నిర్వర్తించలేదని విమర్శిస్తున్నారు.
నిర్మాణ నాణ్యతపై సంబంధిత అధికారులు వెంటనే పరిశీలన జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
