రేపు ‘డయల్ యువర్ సీఎండీ’

రేపు ‘డయల్ యువర్ సీఎండీ’
విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినియోగదారులతో ఏపీఎస్పీడీసీఎల్ ప్రత్యక్ష సంభాషణ
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్ సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు పాల్గొనవచ్చు.
వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లేందుకు 89777 16661 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు నమోదు సమయంలో విద్యుత్ సర్వీస్ నంబర్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకొని పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా సర్కిల్ స్థాయిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాల వారీగా ‘డయల్ యువర్ ఎస్ఈ’ ఫోన్ నంబర్లు:
- తిరుపతి: 8712652679
- చిత్తూరు: 7993147979
- నెల్లూరు: 0861-2320427
- అన్నమయ్య: 94408 17449
- కడప: 08562-242457
- కర్నూలు: 73826 14308
- నంద్యాల: 73826 18976
- అనంతపురం: 91547 90350
- శ్రీ సత్యసాయి: 99637 07847
వినియోగదారులు ఆయా నంబర్లకు ఫోన్ చేసి తమ విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.
