పీహెచ్ఎస్ వేతన కోతలు తక్షణమే నిలిపివేయాలి

పీహెచ్ఎస్ వేతన కోతలు తక్షణమే నిలిపివేయాలి

  • టీఎస్‌టీయూ

ఉట్నూర్, ఆంధ్రప్రభ:

ప్రభుత్వం అమలు చేస్తున్న పీహెచ్ఎస్ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ఖరారు కాకముందే ఉద్యోగుల వేతనాల నుంచి డిడక్షన్ చేయడం సమంజసం కాదని తెలంగాణ ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మూగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్ అన్నారు.

ఆదివారం ఉట్నూర్‌లో వారు మాట్లాడుతూ, పీహెచ్ఎస్ కోతలను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో ఇద్దరి వేతనాల నుంచి పీహెచ్ఎస్ పేరుతో కోతలు విధించడం అన్యాయమన్నారు.

పథకానికి దరఖాస్తు చేసినా, చేయకపోయినా ఉద్యోగులందరికీ ఒకే విధంగా డిడక్షన్లు చేయడం వల్ల ఉద్యోగుల్లో అయోమయం, ఆందోళన నెలకొన్నాయని తెలిపారు.

పీహెచ్ఎస్ పథకానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు, అర్హతలు, అమలు విధానాన్ని ప్రభుత్వం ముందుగా ప్రకటించాలని కోరారు. అనంతరం ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

అప్పటి వరకు ఉద్యోగుల వేతనాల నుంచి జరుగుతున్న పీహెచ్ఎస్ కోతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చేసిన డిడక్షన్లపై కూడా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని మూగ శ్రీనివాస్, జాదవ్ రవికుమార్ కోరారు.