భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారికి ఆషాఢ సారె..
( గంపలగూడెం, ఆంధ్రప్రభ ) : గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో మండల ఆర్యవైశ్య సంఘం, గ్రామ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. పెనుగొలను గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం, గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్ఠించి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు భక్తి గీతాలు, నామస్మరణలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
