కంచుపాడు ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ..
ఉండవెల్లి, ఆంధ్రప్రభ ; మండలంలోని కంచుపాడుగ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి భక్తులు కంచుపాడు ఎల్లమ్మ దర్శానానికి 5రుపాయలు, మొక్క తీర్చుకునే భక్తులు 20రుపాయలుగా అధికారులు నిర్ణయించారు.

కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో కమిటీ సభ్యులు, అధికారుల అలసత్వం తో స్థానిక గ్రామస్తులు భక్తులతో అధిక డబ్బులు వసూళ్లు చేస్తునట్లు భక్తులు ఆవేదన చెందుతున్నారు.అయితే ఇది ఇక్కడితో ఆపకుండా నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
