మున్సిపాల్టీ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాల్టీ పరిధిలోని స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. శనివారం మున్సిపాల్టీలోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న, కమిషనర్ సతీష్ కుమార్ లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మాట్లాడుతూ జిల్లా పార్టీ పిలుపు మేరకు మున్సిపాల్టీలోని సమస్యలను పరిశీంచడం జరిగిందన్నారు.
ప్రధానంగా బృందావన్ కాల్వలో చెత్త అధికమై దుర్వాసనతో కాల్వ పక్కన ఉన్న ఇండ్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే శుభ్రం చేసే విదంగా చర్యలు చేపట్టాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుండి అన్నెపు వాడ వరకు రోడ్డు వేడెల్పు చేసి, సీసీ రోడ్డు వేయాలని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, వృధాప్య, వితంతు, వికలాంగుల, నేత , గీత పెన్షన్లు మంజూరు చెయ్యాలన్నారు. డ్రైవర్ కాలనీ, సుందరయ్య కాలనీ లలో సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు.
మున్సిపల్ పరిధిలోని కొండగడపలో డ్రైనేజీ నిర్మాణం కోసం కొన్ని కట్టడాలను కూల్చి వదలి వేశారని, వెంటనే కాల్వ నిర్మాణం చేపట్టాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డులలో ఉన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య, కూరపాటి రాములు, కందుకూరి నర్సింహా, గుండు లక్ష్మి, కందుకూరి అంజమ్మ, లోడి నర్సింహా తదితరులు పాల్గొన్నారు
