dangerous | ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు…

dangerous | ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు…

  • తుఫాను దాటికి కొట్టుకుపోయిన రహదారి
  • నెల రోజులుగా నిద్రావస్థలో యంత్రాంగం
  • తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోకపోవడంపై ప్రజల ఆగ్రహం
  • అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్ర‌జ‌లు

Nagar Kurnool | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామపంచాయితీ పరిధిలో సిద్దాపూర్ మార్గం పిరమిడ్‌(Siddapur route is a pyramid)లో నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డు అక్షరాలా “సగం” కొట్టుకుపోయింది. బాధాకర విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద ప్రమాదకర(dangerous) పరిస్థితి నెలకొన్నా అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ కనీసం ఒకసారి చూసేందుకు కూడా రాలేదు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోజూ వందలాది మంది ప్రయాణించే ఈ కీలక రహదారి(Road) ఇప్పుడు బారుదిబ్బలా మారింది. తెలియని ప్రయాణికులు వస్తే నేరుగా గుంతలో పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రిపూట అయితే ఇది మరింత ప్రాణాంతకంగా మారింది. అయినా పట్టించుకునే నాయకులు కానీ… చర్యలు తీసుకునే అధికారులు లేరా అని, కనీసం మట్టితో తాత్కాలిక మరమ్మతులైన( road, repaired) చేయించడం లేదని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

బీపీఎఫ్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ నారమోని నరేష్ యాదవ్(Dr. Naramoni Naresh Yadav) మాట్లాడుతూ.. నెలరోజులైతున్నా పట్టించుకోకపోవడం దారుణమ‌నీ, ఒక రహదారి పాడయితే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టినట్టే. అధికారులు వెంటనే స్పందించాల‌న్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయకపోవడం చాలా పెద్ద నిర్లక్ష్యం. ఇది ప్రజల జీవితాలతో ఆడుకోవడమే, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని రహదారిని పునరుద్ధరించాల‌నీ, లేనిచో ఆందోళన బాట తప్పదని హెచ్చరిస్తున్నామ‌న్నారు.