criticized | హరీశ్‌రావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

criticized | హరీశ్‌రావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
criticized | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్‌ఎస్ స్పష్టమైన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా.. వద్దా.. టి.హరీశ్ రావు చెప్పాలి. బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలని బీఆర్‌ఎస్ యత్నిస్తోంది. మెట్రో విస్తరణ చేపట్టాలనుకుంటే కూడా అడ్డుకుంటున్నారని శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీశ్‌రావు మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడితే పెట్టుబడులు రావు.. పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. ఫ్యూచర్ సిటీలో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవు. అలాంటి ప్రాజెక్టును రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.
