Madaram | వనదేవతలకు ఎత్తుబెల్లాలు షురూ..

Madaram | వనదేవతలకు ఎత్తుబెల్లాలు షురూ..

Madaram | పరకాల, ఆంధ్రప్రభ : శ్రీ సమ్మక్క- సారలమ్మ వనదేవతల మహాజాతర మేడారం(Madaram) సమీపిస్తున్న తరుణంలో వనదేవతలకు ఇష్టమైన మొక్కుబడి బెల్లంను వనదేవతలు మొక్కిన భక్తులు మొక్కులు తీర్చేందుకు వారి బరువుకు తగ్గట్టుగా సమపాళ్లల్లో ఎత్తు బెల్లాలను కొనుగోలు చేస్తున్నారు.

ఈ రోజు పరకాల పట్టణంలోని వెలంపల్లి రోడ్డులో గల కిరాణా షాప్ ఎదుట తమ కూతురికి ఎత్తు బెల్లం కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు కనిపించారు. ఈనెల చివరి వారంలో మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ వనదేవతల మహా జాతర జరగనుంది. పరకాల పట్టణ, పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకునే కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఎత్తు బెల్లాలు కొనుగోలు చేస్తున్నారు.

Leave a Reply