బెజ్జంకిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహణ

బెజ్జంకి, ఆంధ్రప్రభ : ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చడం వంటి పనులు నిర్వహించారు.

గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధూమాల మహేష్, వార్డు సభ్యులు భోనగం రమేష్, దొంతర వేణి అంజలి శ్రీనివాస్, కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు బోనగిరి చంద్రయ్య, విద్యా కమిటీ మాజీ చైర్మన్ బోనగిరి లింగయ్య, బోనగిరి గుండయ్య, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a Reply