దుచ్చెర్ల సత్యనారాయణను పరామర్శించిన పలువురు నాయకులు

దుచ్చెర్ల సత్యనారాయణను పరామర్శించిన పలువురు నాయకులు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పర్యావరణ ప్రేమికుడు, జలసాధన ఉద్యమ నాయకుడు, ఫ్లోరైడ్ సమస్య నివారణ కోసం తను జీవితాంతం పనిచేస్తున్న దుచ్చెర్ల సత్యనారాయణ పై జరిగిన దాడిని పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ ను శనివారం పలువురు నాయకులు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయనను పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్, తెలంగాణ సర్పంచ్ ల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
