Contractor | నాణ్యతలో రాజీ పడం…

Contractor | నాణ్యతలో రాజీ పడం…

Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని 15వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ(Construction of CC roads) పనులను మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ ఈ రోజు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం అధికారులతో, కాంట్రాక్టర్‌తో చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల నిత్యవసర ప్రయాణానికి ఉపయోగపడే సీసీ రోడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా నాణ్యతతో నిర్మించాలని, నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్‌(Contractor)కు సూచించారు.

అలాగే రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్న నాణ్యతతో కూడిన సిమెంటు, కంకర, ఇసుక వాడాలని, డ్రైనేజ్(Drainage) సదుపాయాల కల్పన వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రజలకు మేలు చేసేలా పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ బాబా, ఏఈ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.