బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అండ
పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
భీమ్గల్ టౌన్/రూరల్, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని రహత్నగర్, బాచన్పల్లి, భీమ్గల్ గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు బాధిత కుటుంబాలను రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు.
రహత్నగర్లో మాజీ సర్పంచ్ రాజు నాయక్ తల్లి, బాచన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేశ్వర్ తండ్రి, భీమ్గల్కు చెందిన చెక్కల నర్సయ్య కుమార్తె ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవాలని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బాధలో ఉన్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బొదిరె స్వామి, వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, మెండోరా సర్పంచ్ కుంట రమేష్, భూక్య రవి, మలావత్ రవి, బాచన్పల్లి సర్పంచ్ జనార్ధన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్ద అవినాష్, 12వ వార్డు ఇన్చార్జి సుంకరి సురేష్, శ్యామ్రాజ్, చిన్నారెడ్డి, శ్రీను, నరేందర్, కిషన్, రాజేష్, ప్రవీణ్, చింటూ అజయ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
