మందపాక పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
కోడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కోడూరు మండలంలోని మందపాకల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు చికిత్స అందించే విధానం, మౌలిక సదుపాయాలు, మందుల లభ్యత, ప్రసూతి సేవలు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత వైద్యాధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
తర్వాత ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన పలువురు రోగులకు స్వయంగా ఫోన్ చేసి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
