తహసిల్దార్ విజయలక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల తహసిల్దార్ తోట విజయలక్ష్మి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తహసిల్దార్ తోట విజయలక్ష్మి తండ్రి దివంగత తోట లింగం దశదినకర్మ కార్యక్రమం ఖమ్మంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత తోట లింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ పరకాల సమన్వయ కమిటీ సభ్యుడు సోదా రామకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, నడిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దాసరి బిక్షపతి, సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దివంగత తోట లింగం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని నాయకులు ప్రార్థించారు.
