అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
మంత్రాలయం, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరురు గ్రామానికి చెందిన యువరైతు రహిమాన్ (33) అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకోవడం జరిగింది గ్రామస్తులు తెలిపారు. బుధవారం ఈ సందర్బంగా గ్రామం లోని చుట్టుపక్కల వారు వెంటనే హుటా హుటిగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య సలీమా ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో తీవ్రవిషాదం అలుముకుంది కుటుంబ సభ్యులు శ్లోకసద్రంలో కన్నీరుమున్నీరు అయ్యారు.
