NEWS@10:0 A.M | 12 జూలై 2026 ముఖ్యాంశాలు
నేడు హైదరాబాద్ ఛాంపియన్స్-ఖమ్మం ఏసెస్ ఫైనల్ పోరు..
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టోర్నీకి నేడు తెరపడనుంది. హైదరాబాద్ ఛాంపియన్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టైటిల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. click here to read full story
‘డాక్టర్ గూగుల్’పై అతిగా ఆధారపడొద్దు.. వైద్యుల కీలక హెచ్చరిక
మహారాష్ట్రలో డాక్టర్లు ఒక ఆందోళనకరమైన ధోరణిని గమనిస్తున్నారు. రోగులు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఇంటర్నెట్ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకుని, చికిత్స ఆలస్యం చేస్తున్నారు. ఫలితంగా సమస్యలు మరింత తీవ్రం అవుతున్నాయి. మీరు జ్వరంతో మేల్కొంటే, కుటుంబ డాక్టర్‌ను పిలవకుండా గూగుల్‌లో నాలుగు పదాలు టైప్ చేస్తారు. click here to read full story
రైతు డిస్కంకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్.. నాలుగు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఆర్పీడీసీఎల్)కు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎట్టకేలకు లైసెన్స్ మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. click here to read full story
మానవ సంబంధాలకు సాంకేతికతను జోడించకండి!
ఇటీవల రిటైరైనా కొందరి చిరుద్యోగుల కథలు వ్యధలుగా మారుతున్నాయి. ఒకరోజు తండ్రితో బ్యాంకులో క్యూలో నిల్చోవడానికి కోపంతో, విసుక్కున్న కొడుకుతో… ఆ తండ్రి ఇచ్చిన ఆన్సర్స్, తిరుగు క్వశ్చన్స్ ఏమిటో.. ఉదాహరణగా చూద్దాం! సిటీలో చదువుతున్న ఆ కొడుకు ప్రశ్నలకు తండ్రి స్పందన కూడా ఆలోచింపదగినది. click here to read full story
మోడీ విదేశీ పర్యటనకు ప్రవాస భారతీయుల బ్రహ్మరథం
వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి భారత్‌ను లాంచింగ్ ప్యాడ్ వరకూ తీసుకుని వెళ్లిన ఘనత మన ప్రధాని నరేంద్రమోడీకి దక్కుతుంది. 21వ శతాబ్దం భారతేననీ, భారత్‌తో కలిసి పని చేస్తామని న్యూజిలాండ్ ప్రధాని క్రిష్టఫర్ లక్సన్ ప్రకటించారు. click here to read full story
దేహ సాక్షాత్కారం.. దేహమే దైవాన్ని చేరుకునే పవిత్ర సాధనం
సాధారణంగా ఆధ్యాత్మికత అనగానే భౌతిక జగత్తును , ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న పరమాత్మను వెతకడం అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, భారతీయ సనాతన తత్వశాస్త్రం ప్రకారం, అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మ సాక్షాత్కారానికి పునాది ఈ దేహమే. “దేహ సాక్షాత్కారం” అంటే కేవలం మన కంటికి కనిపించే చర్మం, మాంసం, ఎముకల కూర్పును తెలుసుకోవడం కాదు, ఈ భౌతిక రూపం వెనుక ఉన్న అనంతమైన చైతన్యాన్ని, దైవత్వాన్ని దేహ మాధ్యమం ద్వారానే దర్శించడం. click here to read full story
అభివృద్ధి ఫలాలు ప్రజలకేనా? పెట్టుబడిదారులకేనా?
మన పాలకులు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులతో దేశాభివృద్ధి జరగాలని భావించి ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి కార్యక్రమాలన్నీ మానేసి వృద్ధి ప్రక్రియ అంతా పెట్టుబడిదారీ కనసన్నల్లో ఉన్నందున దేశ సంపద కొందరిదిగా అయిపోతున్నది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం జరుగుతున్నది. 2013లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 17.3 లక్షల ఉద్యోగాలు ఉండగా 2022 నాటికి ఉద్యోగాలు 10 లక్షలకు తగ్గిపోయాయి. click here to read full story
