ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన భీమనపల్లి సైదులు

మునుగోడు, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. తనను రెండవ సారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తనపై ఉంచిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలిపారు. మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరోసారి అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
మండల అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉండి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సూచించినట్లు పేర్కొన్నారు.