హిమాన్షు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన గ్రామస్తులు
మొక్కల సంరక్షణకు ప్రతిజ్ఞ చేసిన ముఖరా-కే గ్రామ ప్రజలు
ఇచ్చోడ, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా-కే గ్రామంలో గ్రామస్తులు 200 మామిడి మొక్కలు నాటారు. గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత సంకల్పాన్ని కొనసాగిస్తూ ముఖరా-కే గ్రామంలో ఇప్పటికే లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించామని తెలిపారు. హిమాన్షు జన్మదినాన్ని పురస్కరించుకుని “కేసీఆర్–కేటీఆర్ ఆర్గానిక్ మ్యాంగో ఫామ్”లో 200 మామిడి మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, విఠల్, దత్త, నాగ్‌నాథ్, తులసిరాం, బాబు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
