శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా శ్రీశైలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
తీన్మార్ మల్లన్న వెంట ఆయన సన్నిహితులు, చీకటిమామిడి గ్రామ సర్పంచ్ తిరుమణి నాగరాజు గౌడ్, ఉపేందర్ కుటుంబ సభ్యులు కూడా దర్శనానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించి సత్కరించారు.
