Private buses | భారీ అగ్నిప్రమాదం.. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధం
విజయవాడ ఆటోనగర్‌లో మెకానిక్ షెడ్లో మంటల బీభత్సం..
పార్కింగ్‌లో ఉన్న బస్సులకు ఒక్కసారిగా వ్యాపించిన మంటలు
ఏడు బస్సులు దగ్ధం..
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…. సహాయక చర్యలు ముమ్మరం..
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం
Private buses | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అక్కడ పార్కింగ్‌లో ఉన్న ప్రైవేట్ బస్సులకు వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం ఏడు ప్రైవేట్ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

భారీగా ఎగిసిపడిన మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ, బస్సులు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారుల దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడికానున్నాయి.



