Congress Party | హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

Congress Party | హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
Congress Party | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్(Gandhi Bhavan)లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (SIR), బీఎల్‌ఏ-2 (BLA-2)లకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు Mahesh Kumar Goud, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ Meenakshi Natarajan, ఏఐసీసీ కార్యదర్శి Sachin Sawant పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ శిక్షణ విభాగం చైర్మన్, ఎమ్మెల్యే Ram Mohan Reddy సమక్షంలో టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన నిపుణులైన ట్రైనర్లు సౌరబ్, నిశాంత్, అనూష మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీలు అనంతరం నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బూత్ స్థాయి నిర్వహణ, పార్టీ సమన్వయం వంటి అంశాలపై ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

