మలిదశ ఉద్యమకారులకు న్యాయం జరగాలి

మలిదశ ఉద్యమకారులకు న్యాయం జరగాలి

– ఆడెపు బాలస్వామి

ఆలేరు, ఆంధ్రప్రభ : మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిలుపుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, సీనియర్ నేత ఆడెపు బాలస్వామి అన్నారు.

గురువారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా మలిదశ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న వారి పాత్రపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి నిర్ధారణకు వచ్చిన తర్వాత గుర్తింపు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా అత్యంత స్పష్టతతో, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply