సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మునుగోడు, ఆంధ్రప్రభ:
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన జనగాం మణికంఠకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.21,000 చెక్కును బీఆర్ఎస్ నాయకుడు పగిళ్ల రాము సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చెక్కు అందుకున్న మణికంఠ కుటుంబ సభ్యులు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగాం నర్సింహా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.