CM Revanth | ఎమ్మెల్యేకు ఘన సన్మానం…

CM Revanth | ఎమ్మెల్యేకు ఘన సన్మానం…

CM Revanth | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్‌(MLA Valla Naveen Yadav)ను సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు బాణాసంచా పేల్చి, మంగళహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ… ఇంత ఘన స్వాగతం పలికిన మహిళా కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ విజయంలో మహిళా నాయకుల కృషి, ప్రజల ఆశీర్వాదాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసిన మహిళా నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లోని విజయాలను కొనసాగిస్తూ GHMC ఎన్నికల్లో కూడా గెలుపు సాధించేందుకు అందరూ పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ జిల్లా మహిళ ప్రెసిడెంట్ కవిత, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రెసిడెంట్ జ్యోతి, వివిధ డివిజన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply