Auspicious Times | శూన్యమాసం ముగిసింది..

శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్

జూన్ 27 నుంచి జూలై 9 వరకు పలు శుభ దినాలు

Auspicious Times | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఈ నెల 15తో శూన్యమాసం ముగియగా, 16 నుంచి నిజ జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. దీంతో శుభకార్యాలకు మళ్లీ అనుకూలమైన కాలం మొదలైందని జ్యోతిష పండితులు వెల్లడిస్తున్నారు.

జ్యోతిష నిపుణుల ప్రకారం జూన్ 27, 28 తేదీలతో పాటు జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీల్లో అత్యంత శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజుల్లో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, వ్యాపార ప్రారంభాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు అనేక మంది ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అలాగే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా పలు మంచి ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. అయితే శుభకార్యాల కోసం తేదీని నిర్ణయించే ముందు కుటుంబ సంప్రదాయాలు, వ్యక్తిగత జాతకాలు, స్థానిక పంచాంగాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.